హ్యూమన్ రైట్స్ కమిషన్ అనేది 1992లో ప్యారిస్లో 190 దేశాలు అన్ని కూడా ఆమోదించాయి. మన భారతదేశం 1993 అక్టోబర్ 12న నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ద్వారా హ్యూమన్ రైట్స్ యాక్ట్ 1993 ద్వారా ఎన్. హెచ్. ఆర్. సి నీ ప్రారంభించడం జరిగింది. జాతీయ మానవ హక్కుల కమిషన్ లో ఒక చైర్మన్, నలుగురు సభ్యులు ఉంటారు.
అయితే దీనిలో సుప్రీం కోర్ట్ రిటైర్డ్ చీఫ్ జస్టిస్ చైర్మన్గా వ్యవహరిస్తారు. సుప్రీం కోర్టు జడ్జి గారు, హైకోర్టు జడ్జి గారు దీనికి సభ్యులుగా ఉంటారు. ఇందులో లో ఎక్స్ అఫీషియల్ సభ్యులుగా జాతీయ ఎస్సీ కమిషన్, జాతీయ ఎస్టీ కమిషన్, జాతీయ మైనారిటీ కమిషన్, జాతీయ ఉమెన్ కమిషన్, ఈ నలుగురు సభ్యులు కూడా ఇందులో ఎక్స్ అఫీషియల్ సభ్యులుగా వ్యవహరిస్తారు. మరో ఇద్దరు సభ్యులను మానవ హక్కుల పై అనుభవం కలిగిన వారిని తీసుకుంటారు.
మొదటి జాతీయ మానవ హక్కుల చైర్మన్ గా రంగనాథ్ మిశ్రా వ్యవహరించారు. జాతీయ మానవ హక్కుల చైర్మన్ ను, ఇతర సభ్యులను రాష్ట్రపతి కమిటీ సూచనల మేరకు నియమిస్తారు. ఇది ఒక స్వతంత్ర ప్రతిపత్తి గల ఒక సంస్థ, పూర్తి హక్కులు ఉంటాయి. అయితే ఇటువంటి హ్యూమన్ రైట్స్ కమిషన్ ప్రతి స్టేట్ లో ఒక హ్యూమన్ రైట్స్ కమిషన్ ఉంటుంది. దీనంతటికీ కూడా ఎన్. హెచ్. ఆర్. సి నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అనేది వారి సిఫార్సు మేరకు ఇవన్నీ జరుగుతాయి. అయితే చాలామంది మనకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు హ్యూమన్ రైట్స్ కి వెళ్ళిపోదాం కంప్లైంట్ ఇవ్వాలి అని అనుకుంటారు.
అసలు హ్యూమన్ రైట్స్ అంటే ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. మనిషి పుట్టిన తర్వాత జీవించే హక్కు, మాట్లాడే హక్కు, అనేక రకమైన స్వచ్ఛమైన హక్కులను భారత రాజ్యాంగం కల్పించింది. ఈ రాజ్యాంగంలో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెస్, ఫ్రీడమ్ ఆఫ్ లీవ్ అని మానవుడికి అనేక రకమైన హక్కులు ఉన్నాయి. ఎప్పుడైతే ఈ హక్కులు మానవుడికి భంగం కలుగుతున్నాయి అప్పుడు ఎన్. హెచ్. ఆర్ .సి ద్వారా మన హక్కులను పరిరక్షించుకోవచ్చు. హ్యూమన్ రైట్స్ మనం కంప్లైంట్ ఎవరికి ఇవ్వాలి! ఏ సందర్భంలో ఇవ్వాలి! అనే విషయం మీద అ ఇప్పుడు చర్చిద్దాం.
మన హక్కులను భంగం కలిగించే టప్పుడు అది ప్రభుత్వ ఉద్యోగి అయినా, లేదా వేరే ఎవరైనా కావచ్చు అటువంటి సమయంలో మనం ఎన్. హెచ్. ఆర్. సి కి కంప్లైంట్ ఇవ్వచ్చు. మరీ ముఖ్యంగా లాకప్ డెత్ కేసులు గాని, హత్యాచారాలు గాని, కాలుష్యం వల్ల ప్రజలను ఇబ్బంది పడినప్పుడు గాని లేదా ఎవరైనా పోలీస్ అధికారి వ్యతిరేకంగా లేదా కావాలని చిత్రహింసలకు గురి చేసిన గాని ఎన్ .హెచ్. ఆర్. సి వెబ్ సైట్ లో కంప్లైంట్ ఇవ్వ వచ్చు లేదా స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కు లెటర్ కూడా రాయవచ్చు. వారు కేసు ఫైల్ చేసి ఒక ఫైల్ ని తయారు చేసి వారు విచారణ చేబడతారు.
మానవ హక్కులకు భంగం కలిగితే! కంప్లైంట్ చేయవచ్చా!
Reviewed by RK WRITERS
on
నవంబర్ 01, 2021
Rating:
కామెంట్‌లు లేవు: