అమెరికాను వణికిస్తున్న ఉల్లిపాయ!

అగ్రరాజ్యం అమెరికాలో చిన్న ఉల్లి గడ్డ గడగడలాడిస్తోంది. ఈ ఉల్లిపాయలు తిన్నవారు సాల్మోనెల్లా సిస్ వ్యాధి బారిన పడుతుండటం తో ఆందోళన మొదలైంది. ఈ వ్యాధి మరింత  ప్రభళితే  మహమ్మారిగా మారే ముప్పు ఉందని సెంట్రల్ ఫర్ డిసిషన్ ప్రివెన్షన్ సి.డి.సి హెచ్చరించింది. 
అమెరికాను మరొక కొత్త వ్యాధి వణికిస్తోంది. వంట గదిలో ఉండే ఉల్లిపాయలు నుంచి సాల్మోనెల్లా సిస్ అనే వ్యాధి వ్యాపిస్తోంది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో భారీగా కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. సాల్మొనెల్లా బ్యాక్టీరియా వ్యాప్తికి ఉల్లిపాయల మధ్య సంబంధం ఉందని సెంట్రల్ ఫర్ డిసిషన్ ప్రివెన్షన్ తెలిపింది. అక్టోబర్ 18 నాటికి 37 రాష్ట్రాల్లో 652 మందికి వ్యాపించిందని సి. డి. సి తెలిపింది. 
ఈ వ్యాధి మరింత  ప్రభళితే మహమ్మారిగా మారే ముప్పు ఉందని సిడబ్ల్యుసి హెచ్చరించింది. నిజానికి సెప్టెంబర్ మధ్యలోనే సాల్మోనెల్లా కేసులు బయటపడ్డాయి. కానీ ఏ ఆహారం వల్ల వచ్చిందనే  విషయాన్ని అధికారులు గుర్తించలేదు. ప్రధానంగా మెక్సికో చిహోవా నుంచి ప్రో సోర్స్ అనే సంస్థ ఉల్లిపాయలను దిగుమతి చేసుకుంది. ఉల్లిపాయలను అనేక రెస్టారెంట్లు కిరాణా షాపులకు పంపిణీ చేసింది. 
అమెరికాలో ప్రస్తుతం ఈ వ్యాధి వ్యాప్తికి ఈ ఉల్లిపాయలు కారణమని అధికారులు నిర్ధారణకు వచ్చారు. ఉల్లిపాయలు సరఫరాదారులకు ఈ సాల్మోనెల్లా వ్యాధితో ఏమైనా సంబంధం ఉందా అనే కోణంలో అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. 
మూడు నెలలపాటు నిల్వచేసిన ఉల్లిపాయలను వాడొద్దని సి. డి. సి వినియోగదారులని హెచ్చరించింది. ఎక్కడి నుంచి వచ్చాయో తెలియకపోయినా మెక్సికో నుంచి వచ్చినవి అయినా ఎలాంటి స్టిక్కర్ లేకపోయినా ప్రో సోర్స్ సంస్థ నుంచి వచ్చిన ఉల్లిపాయలు అయినా వాటిని బయట పడేయాలని సి. డి. సి సూచించింది. జూలై 1 నుంచి ఆగస్టు 27 వరకు దిగుమతి చేసుకున్న ఉల్లిపాయలను వెనక్కి తీసుకునేందుకు ప్రో సోర్స్ స్వచ్ఛందంగా ముందుకు వచ్చిందని ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఎఫ్. డి. ఎ తెలిపింది. ఇప్పటికే అన్ని దుకాణదారులు ఉల్లిపాయలను వెనక్కి పంపాలని ప్రో సోర్స్ రీకాల్ నోటీసుల ని జారీ చేసిందని ఎఫ్. డి. ఎ స్పష్టం చేసింది. ఇప్పటికే అమెరికాలో 37 రాష్ట్రాల్లో  సాల్మోనెల్లా వ్యాపించిందని సి. డి. సి గుర్తించంది. 
అయితే ఇప్పటివరకు అధికారికంగా గుర్తించిన కేసులు కన్నా బాధితుల సంఖ్య ఎక్కువగానే ఉండవచ్చని  సి. డి. సి అభిప్రాయపడింది. చాలామందికి  సాల్మోనెల్లా పరీక్షలు చేయకముందే వారు కోలుకుంటున్నారని సంస్థ తెలిపింది.



అమెరికాను వణికిస్తున్న ఉల్లిపాయ! అమెరికాను వణికిస్తున్న ఉల్లిపాయ! Reviewed by RK WRITERS on అక్టోబర్ 31, 2021 Rating: 5

కామెంట్‌లు లేవు:

Blogger ఆధారితం.