నిద్ర పట్టకపోవడానికి ముఖ్యమైన కారణం ఒత్తిడి కి గురవడం. ఇంట్లో లేదా బయట రకరకాల సమస్యలు ఉండడం వలన వాటి ఆలోచనలతో నిద్ర సరిగ్గా పట్టదు. ఇలా నిద్ర పట్టకపోడం వలన అనేక ఆరోగ్య సమస్యలకు కారణం అవుతుంది. దీని వలన కోపం, డిప్రెషన్, చిరాకు మొదలవుతుంది. మనం సహజంగా 7 నుండి 8 గంటలు నిద్రపోవాలి.కాని మనం రాత్రి 11 లేదా 12 గంటలకు పడుకుంటే తెల్లవారి జామున మెలుకువ వచ్చి ఒక్కొక్కసారి సరిగా నిద్ర పట్టదు.ఇప్పుడు మనం నిద్ర సంపూర్ణగా రావాలంటే పాటించవలసిన నియమాలు చూద్దాం........
మొదటగా తొందరగా భోజనం ముగించుకోవడం, తొందరగా అంటే 6 లేదా 7 లోపు అన్నమాట, ఇంకా రాత్రి పూట అల్పాహారం తీసుకోవడం వలన బాగా నిద్ర పడుతుంది.ఎందుకంటే మనం తిన్న ఆహారం జీర్ణం కావడానికి కనీసం 4 నుంచి 6 గంటలు పడుతుంది. అందుకే చూసారా కొంత మందికి తెల్లవారుజామున బాగా నిద్ర పడుతుంది, వాళ్ళు ఎం చేస్తారంటే రాత్రి ఆలస్యంగా భోజనం చేస్తారు కాబట్టి, ఆలస్యంగా నిద్ర వస్తుంది.
సెల్ ఫోన్ కు దూరంగా ఉండడం, ఈ మద్య సెల్ ఫోన్ లేకుంటే కాలం గడవడం లేదు. కనీసం పడుకునే గంట ముందు అయినా సెల్ ఫొన్ వాడడం ఆపెయ్యాలి.
ఉదయం వ్యాయమం చేయాలి,వ్యాయమం చేయడం వలన శరీరాన్ని బాగా ఉత్తేజ పరుస్తుంది. రాత్రి బాగా నిద్ర పడుతుంది.
ఇంకా బాగా నిద్ర పట్టాలంటే రాత్రి పడుకునే ముందు ఒక గ్లాస్ గోరు వెచ్చని వేడి పాళ్లలో కొంచెం తేనె కలుపుకొని త్రాగాలి.
పడుకునేటప్పుడుతల క్రింద పిల్లో లేకుండా ఎడమవైపు తిరిగి పడుకోవాలి, ఎడమ వైపు తిరిగి పడుకోవడం వలన బాగా నిద్ర పడుతుంది.
పడుకునేటప్పుడు శ్వాస మీదే ధ్యాస ఉండాలి. ఎందుకంటే ఒక్కొక్కసారి కొంతమందికి కోపంగాను,చిరాకుగాను,డిప్రెషన్ లోను వుంటారు.
చిటికెలో నిద్ర పట్టడానికి చిట్కాలు!
Reviewed by RK WRITERS
on
ఆగస్టు 12, 2020
Rating:
కామెంట్‌లు లేవు: