Jr NTR: ఎన్టీఆర్ నటించిన ఆ సినిమా బ్లాక్‌బస్టర్ కావాల్సింది.. కానీ ఫలితం తారుమారైంది.. సీనియర్ ఎడిటర్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Jr NTR: ఎన్టీఆర్ నటించిన ఆ సినిమా బ్లాక్‌బస్టర్ కావాల్సింది.. కానీ ఫలితం తారుమారైంది.. సీనియర్ ఎడిటర్ ఆసక్తికర వ్యాఖ్యలు! తెలుగు సినీ పరిశ్రమలో ఎన్నో విజయవంతమైన చిత్రాలకు ఎడిటర్‌గా పనిచేసిన మార్తాండ్ కె. వెంకటేష్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తన సినీ ప్రయాణంతో పాటు సినిమాల విజయాపజయాలు, ఎడిటింగ్ ప్రాధాన్యత, టెక్నికల్ టీమ్‌కు దక్కుతున్న గుర్తింపు, ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ల పనితీరుపై తన అభిప్రాయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ నటించిన కొన్ని సినిమాల గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ముఖ్యంగా భారీ అంచనాలతో విడుదలైన 'శక్తి', 'ఆంధ్రావాలా' సినిమాల గురించి ఆయన ప్రస్తావించారు. మొదట తాము విన్న కథకు, చివరకు ప్రేక్షకుల ముందుకు వచ్చిన కథకు మధ్య కొన్ని మార్పులు చోటుచేసుకున్నాయని తెలిపారు. ముఖ్యంగా 'శక్తి' సినిమా విషయంలో కథలో జరిగిన మార్పులు సినిమా ఫలితాన్ని ప్రభావితం చేసి ఉండవచ్చని అభిప్రాయపడ్డారు. మంచి కథతో తెరకెక్కి ఉంటే ఈ సినిమా మరింత మెరుగైన విజయాన్ని అందుకునే అవకాశం ఉండేదనే విషయాన్ని ఆయన వ్యాఖ్యలు స...