బాలయ్యకు చిరుకు మధ్య పోటీ!



చాలా రోజుల తర్వాత బాలయ్యకు చిరుకి మధ్య పోటీ కుదిరింది. అప్పుడెప్పుడో 2017లో మెగాస్టార్ చిరంజీవి నటించిన 'ఖైదీ నెంబర్ 150', నందమూరి బాలకృష్ణ నటించిన 'గౌతమీపుత్ర శాతకర్ణి' మధ్య పోరు జరిగింది. ఆ రెండు చిత్రాలు కూడా బాక్సాఫీస్ వద్ద బాగా కలెక్షన్లు రాబట్టాయి. 

ఇన్ని రోజుల తర్వాత మెగాస్టార్ చిరంజీవి నటించబోతున్న 'వాల్తేరు వీరయ్య', నందమూరి బాలకృష్ణ నటించిన పోతున్న 'వీర సింహారెడ్డి' మధ్య పోరు జరగనుంది. ఇద్దరూ స్టార్ హీరోల మధ్య పోటీ జరుగుతుందంటే ఎలా ఉంటుందో చెప్పక్కర్లేదు, ఎందుకంటే ఒకప్పుడు ఇద్దరు కూడా పోటీ పడుతూ సినిమాలు తీశారు. ఇప్పుడు ఉన్న యంగ్ హీరోలతో పోటీపడి మరి, బాక్సాఫీస్ వద్దా భారీగా కలెక్షన్లో ఏమాత్రం తగ్గకుండా పోటీపడుతున్నారు. 


అప్పట్లో వీరిద్దరి మధ్య సినిమా పోటీ జరుగుతుందంటే ఫ్యాన్స్ మామూలు హంగామా చేసేవారు కాదు. ఇంకా మెగాస్టార్ చిరంజీవి గురించి చెప్పాలంటే ఆయన డైలాగ్, డాన్స్, కామెడీ టైమింగ్, ఎక్స్ప్రెషన్స్, సినిమాకి హైలైట్ గా నిలుస్తాయి. ఇంకా నందమూరి బాలకృష్ణ గురించి చెప్పాలంటే ఆయన ఒక్కడే సినిమా మొత్తాన్ని నడిపించే సత్తా, ఆయన డైలాగ్ చెప్తుంటే సినిమా థియేటర్లలో ఫ్యాన్స్ ఈలాలతో మారు మ్రోగిపోతుంది. 


ఆయన ఇదివరకు నటించిన చెన్నకేశవరెడ్డి, సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, పల్నాటి బ్రహ్మనాయుడు, ఎన్నో ఫ్యాక్షనిస్టు సినీ చిత్రాలను నటించి మెప్పించి ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఆయన డైలాగ్ చెప్తుంటే ముసలోడికి కూడా రక్తం మరుగుతుంది, అలా చెప్తాడు ఆయన. ఇప్పుడు పోటీ జరుగుతున్న సినిమాలు కూడా 'మాస్ ఆడియన్స్' కు బాగా నచ్చుతాయి. 

చాలా రోజుల తర్వాత చిరంజీవి మంచి కామెడీ అండ్ మాస్ ఓరియెంటెడ్ సినిమా చేయబోతున్నారు . ఇందులో మాస్ మహారాజా రవితేజ కీలకపాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. ఇంకా బాలకృష్ణ నటి స్తున్న సినిమా ఫ్యాక్షన్ నేపథ్యంలో జరుగుతుందన్న టాక్ వినిపిస్తోంది. 


ఇక ఈ రెండు సినిమాలను కూడా మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న విషయం తెలిసిందే. కాబట్టి వీటి ఓవర్సీస్ ను కూడా ఒక సంస్థకు పగించింది. యూ.ఎస్.ఎ లో చిరంజీవి సినిమా వాల్తేరు వీరయ్యను 7 కోట్లకు కొనగా, బాలకృష్ణ సినిమాను 4 కోట్లకు కొనడం జరిగింది.

బాలయ్యకు చిరుకు మధ్య పోటీ! బాలయ్యకు చిరుకు మధ్య పోటీ! Reviewed by RK WRITERS on నవంబర్ 01, 2022 Rating: 5

కామెంట్‌లు లేవు:

Blogger ఆధారితం.