సంక్రాంతి పండగకు మన ముందుకు వస్తున్నా టాప్ హీరోలు. 2020 లో సంక్రాంతి పండుగకు మనకు రెండు బ్లాక్ బాస్టర్ మూవీస్ వచ్చాయి.
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సరిలేరు నికెవ్వరు సినిమా బ్లాక్ బాస్టర్ గా నిలిచి, భారీ వసూళ్లను సాధించింది. ఈ సినిమా ను డెరెక్టర్ అనిల్ రావి పూడి గారు తెరకెక్కించారు.
అలాగే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన అలా వైకుంటాపురంలో ఒక రెంజులో దూసుకెళ్లింది. ఈ సినిమాను మన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ గారు అలా!.... వైకుంటాపురంలోకి తీసుకెళ్లాడు. ఈ రెండు సినిమాలు 2020 సంక్రాంతి పండగకు భారి వసూళ్లను సాధించాయి.
అలాగే ఇప్పుడు వచ్చే 2021 సంక్రాంతి పండుగ కు కూడా పోటీ పడుతున్నాయి. నేను ట్రెండు ఫాలో అవ్వను నేను ట్రెండు సెట్ చేస్తాను అంటూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన గబ్బర్ సింగ్ మూవీ టాలీవుడ్ లో భారీ కలెక్షన్స్ తో దూసుకెళ్లిందని మనందరికి తెలుసు.
ఇప్పుడు మన ముందుకు వకీల్ సాబ్ తో ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఆల్రెడీ మగువ మగువ సాంగ్ చాలా వ్యూస్ అందుకుంది. ఈ సినిమాకు వేణు శ్రీరామ్ దర్శకత్వం అందిస్తున్నారు.ఈ సినిమాను సంక్రాంతి పండగకు తీసుకురావలని నిర్మాత దిల్ రాజు గారు ప్రయత్నిస్తున్నారు.
ప్రపంచ వ్యాప్తంగా భారీ వసూళ్లను సాధించిన ఇంకొక సినిమా రాకి బాయ్ యష్ నటించిన కె. జి. ఎఫ్. ఈ సినిమాను 2018 డిసెంబర్ 21 న విడుదల చేసారు. ఈ సినిమా బడ్జెట్ 80 కోట్లు అయితే ఏకంగా 250 కోట్లను బాక్స్ ఆఫీస్ వద్ద బద్దలు కొట్టింది. ఈ సినిమాను ప్రశాంత్ నీల్ డెరెక్టు చేస్తున్నారు.
ఈ సినిమా సీక్వెల్ గా కె.జి.ఎఫ్ 2 నిర్మాత విజయ్ కిరగందుర్ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ గారు నటిస్తున్నారు. ఈ సినిమా అక్టోబర్ లో రిలీజ్ అవాల్సిఉండేది. కానీ కరోన కారణంగా ఈ సినిమాను సంక్రాంతి పండుగ కు రిలీజ్ కావచ్చు అని టాక్. ఈ సినిమాను తెలుగు, హిందీ, మలయాళం, తమిళం, లో కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది.
సంక్రాంతి బరిలోకి దుకుతున్నా దమ్మున్న హీరోలు!
Reviewed by RK WRITERS
on
ఆగస్టు 29, 2020
Rating:
కామెంట్‌లు లేవు: