రక్తంలో జరిగే కొన్ని ముఖ్యమైన విషయాలు!

 


రక్తంలోని కొన్ని ముఖ్యమైన విషయాలు: 

  • రక్తాన్ని గురించిన అధ్యయనాన్ని హెమటాలజీ అంటారు. 
  • రక్తంలో కణాంతర ద్రవాన్ని ప్లాస్మా అంటారు. 
  • రక్తం శరీరంలో, ఒక ద్రవరూప కణజాలం. 
  • సోడియం సిట్రేట్ ద్రావణాలను వేయకుండా మనం రక్తాన్ని సేకరించేటప్పుడు గడ్డకట్ట గా మిగిలిన ద్రవాన్ని సీరం అంటారు. 
  • రక్తంలో ప్లాస్మా ఒక మాత్రుక. రక్తం మొత్తం పరిమాణంలో ఇది 60 శాతం ఉంటుంది. 


  • సోడియం, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం ల క్లోరైడ్ లు, పోస్ఫైట్ లు, సల్ఫేట్ లు, బై కార్బోనేట్ లు ప్లాస్మాలో ఉంటాయి. 
  • రక్తంలో లో చక్కెరలు (ముఖ్యంగా గ్లూకోజ్), అమైనో ఆమ్లాలు, కొవ్వు ఆమ్లాలు, యూరియా,  ప్రోటీన్లు మొదలైన కర్బన రసాయన పదార్థాలు ఉంటాయి. 
  • రక్తంలో ఉండే హిపారిన్ రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టకుండా చూస్తుంది. 


  • రక్తంలో ఎర్ర రక్త కణాలు ఎక్కువ సంఖ్యలో ఉంటాయి. 
  • ఎర్ర రక్త కణాలు ఉత్పత్తిని ఎరిత్రో పాయిసిస్ అంటారు. 
  • ఎర్రరక్త కణాల్లో హిమోగ్లోబిన్ అనే వర్ణక పదార్థం ఉంటుంది. ల్యుకో సైట్లను తెల్ల రక్త కణాలు అంటారు. తెల్ల రక్త కణాలు 12 నుంచి 13 రోజులు సజీవంగా ఉంటాయి. 
  •  తెల్ల రక్త కణాలు శరీరంలోకి ప్రవేశించే క్రిములను కబళించి వేస్తాయి. అందుచేత వీటిని భక్షక కణాలు అంటారు. ఇది ఏమీబాలో వలె జరుగుతుంది. 

రక్త ఫలకికలు: 

ఇవి అండకారంగా, గుండ్రంగా లేక ద్వికుంభాకారంగా ఉంటాయి. వీటిలో కేంద్రకము ఉండదు. కానీ జీవపదార్థం ఉంటుంది. రక్తం గడ్డకట్టడంలో ప్రముఖ పాత్ర వహిస్తాయి. 


గాయమైనప్పుడు ఇవి అక్కడ చేరి అక్కడ ఒక బీరడాల ఏర్పడుతాయి. దీనివల్ల కొంత వరకు గాయాల వద్ద రక్త నష్టం తగ్గుతుంది. రక్తం గడ్డ కట్టడానికి గాయాలు మానడానికి అవసరమైన అనేక కారకాలను ఇవి రక్తంలో కి విడుదల చేస్తాయి.





రక్తంలో జరిగే కొన్ని ముఖ్యమైన విషయాలు! రక్తంలో జరిగే కొన్ని ముఖ్యమైన విషయాలు! Reviewed by RK WRITERS on నవంబర్ 16, 2021 Rating: 5

కామెంట్‌లు లేవు:

Blogger ఆధారితం.