కంప్యూటర్ వైరస్ లు, ఇంటర్నెట్ టెర్మినాలజీ!



వైరస్ లు అతి సూక్ష్మ మైనవి. ఇవి ఇతర కణాలపై సోకి వాటిని అంతరింపజేస్తాయి.ఈ వైరస్ లు మనిషి శరీరంలో ప్రవేశించినప్పుడు ఎలా వ్యాధి గ్రస్తుడు అవుతాడో కంప్యూటర్లలోప్రవేశించినప్పుడు ప్రోగ్రామ్ లు సరిగా పనిచేయకపోవడం, ఇంకా అసలు పని చేయకపోవడం జరుగుతుంది. 

ఇవి కంప్యూటర్ లోని కీలకమైన సమాచారాన్ని పాడుచేయటం లేదా తొలగించడం చేస్తాయి. కంప్యూటర్ లోని సమాచారాన్ని పాడుచేయటమే వైరస్ లక్షణం.


               ఇంటర్నెట్ టెర్మినాలజి

ఆండ్రాయిడ్: ఆండ్రాయిడ్ 2008 సంవత్సరంలో మొదలయింది. శామ్ సంగ్, హెచ్. టి. సి మరియు మరికొన్ని ప్రసిద్ద కంపెనీల ఫోన్లలో ఈ ఆపరేటింగ్ సిస్టమ్ పనిచేస్తుంది.మనిషి తెలివితో సమానంగా అంతకుమించి కృత్రిమమైన  మేధా శక్తిని  కలిగిన కంప్యూటర్ సాఫ్ట్వేర్ ఆండ్రాయిడ్.


ఫేస్ బుక్
: ఫేస్ బుక్ ను కనుగొన్నది మాస్ఓ స్కర్ బర్గ్. గ్లోబల్ సోషల్ నెట్వర్క్ ద్వారా పర్సనల్ ప్రొఫైల్ ను క్రెయేట్ చేసుకుని స్నేహితులను జతపరుచుకోవచ్చు.ఫేస్ బుక్ తెరవడానికి కనీస వయసు 13 సంవత్సరాలు నిండి ఉండాలి.


యూ ట్యూబ్
: చాడ్ హార్లి, స్టీవ్ చెన్ జావేద్ కరీమ్ వీరు ముగ్గురు యూ ట్యూబ్ ను ప్రారంభించారు. యూ ట్యూబ్ అనేది షేరింగ్ వెబ్సైట్. సోషల్ నెట్వర్క్  ఎంతో ఆదరణ పొందుతున్న వెబ్సైట్ యూ ట్యూబ్.ఇందులో వీడియోల ని, ఫొటోలని, పాటలను అందరితో పంచుకోవడం యూ ట్యూబ్ ప్రత్యేకత.


వెబ్సైట్
: ఎక్కువ లింకులతో కలిపిన కొన్ని వెబ్ పేజీలను సమూహాన్ని వెబ్ సైట్ అని అంటారు.


విండోస్
: రకరకాల సిస్టమ్ లతో సంబంధం లేకుండా దేన్నైనా కనుగొనడానికి వెర్షన్ పెరు చెప్పకుండా సులభంగా 'విండోస్' అంటారు.


గూగుల్ మ్యాప్స్
: ఈ గూగుల్ మ్యాప్స్ ను 2005 లో ప్రారంభించారు. దీని ద్వారా ప్రపంచంలో ఎక్కడ ఉన్నా ప్రదేశాన్నైనా కూడా చూడవచ్చు.ఇందులో ఇండోర్ మ్యాప్ లను కూడా ప్రవేశపెడుతున్నారు.


గూగుల్ క్రోమ్
: 2008 లో ఈ గూగుల్ క్రోమ్ ని ప్రారంభించారు. అన్ని వెబ్ బ్రౌజర్ ల కంటే అతి వేగంగా పనిచేసే వెబ్ సైట్ ఇది.మిగితా బ్రౌజర్ ల కంటే వేగంగా సులభంగా పనిచేస్తుంది.


ఇంటర్నెట్
: టీమ్ బెర్నెర్స్లీ ఇంటర్నెట్ ను రూపొందించారు. ప్రపంచ స్థాయిలో ఏర్పడ్డ అనేక కంప్యూటర్ నెట్వర్క్ ల సమూహం నెట్వర్క్. కంప్యూటర్ కు ఇంటర్నెట్ ను కలపడం ద్వారా ఎక్కడ ఉన్నా సమాచారాన్ని అయినా పొందవచ్చు.











కంప్యూటర్ వైరస్ లు, ఇంటర్నెట్ టెర్మినాలజీ! కంప్యూటర్ వైరస్ లు, ఇంటర్నెట్ టెర్మినాలజీ! Reviewed by RK WRITERS on సెప్టెంబర్ 01, 2020 Rating: 5

కామెంట్‌లు లేవు:

Blogger ఆధారితం.