పెట్రోలియం గురించి


 పెట్రోలియం హైడ్రోకార్బన్ ల మిశ్రమం. ఇది అవక్షేప శిలలు వుండే బేసిన్ లోను, సముద్రతీరంలోను, సముద్ర ఖండ తీర అంచులలోనూ లభిస్తుంది. పెట్రోలియం ను ముడిచమురు, రాతి నూనె, క్రూడాయిల్ అని పిలుస్తారు. దీనినే బంగారు ద్రవం అని కూడా పిలుస్తారు. పెట్రోలియం ప్రపంచంలోనే చాలా ముఖ్యమైన శక్తి వనరు. ముడి చమురు భూ అంతర్భాగం నుంచి వెలకితీసి శుద్ధిచేసి పెట్రొల్, కిరోసిన్, డీజిల్, గ్రీజు, ఇంజిన్ ఆయిల్ మొదలైన వాటిని తయారు చేస్తారు.


పెట్రోల్, ముడి చమురు నుంచి అనేక ఇతర ఉత్పత్తులను ఉత్పత్తి చేస్తున్నారు. వాహన రంగం మొత్తం ఈ ఉత్పతులపై ఆధారపడి ఉంది. భారతదేశంలో పెట్రోలియం నిల్వలు చాలా తక్కువా మోతాదులో ఉన్నాయి. భారతదేశంలో పెట్రోలియం శాతం ఎక్కువగా టర్సియారీ శిలాల్లో నిక్షిప్తమై ఉన్నాయి.

భారతదేశంలో ఈ నిల్వలు 0.75 మిలియన్ చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో 775 మిలియన్ మెట్రిక్ టన్నుల ఉన్నట్లు సర్వే ద్వారా నిర్దారించారు.







పెట్రోలియం గురించి పెట్రోలియం గురించి Reviewed by RK WRITERS on ఫిబ్రవరి 12, 2021 Rating: 5

కామెంట్‌లు లేవు:

Blogger ఆధారితం.