భారతదేశంలో ఎన్నికలు! ఫలితాలు!


 మన ప్రజాస్వామ్యం కుల మత భావనపై ఆధారపడి ఉంది. విశాలమైన భూభాగం అత్యధిక జనాభా గల దేశం కుల మత భావనలు లేకుండా ప్రజాస్వామ్య వ్యవస్థను నిర్వహించడం కష్టతరం. ప్రజలంతా సమావేశం కావడం చర్చించడం నిర్ణయాలు తీసుకోవడం ఎప్పుడూ సాధ్యం కాదు. ఈ విధానం ఫలితంగా తమ చేయి ఎన్నిక కాబడిన ప్రతినిధుల ద్వారా ప్రజలు ప్రభుత్వాన్ని అదుపు చేయగలుగుతున్నారు. ఆచరణలో ఓటు హక్కు అంటే ప్రతినిధులను ఎంపిక చేసుకునే హక్కు అని అర్థం. 

 రాజ్యాంగం ప్రసాదించిన ఈ హక్కును వయోజన ఓటు హక్కు అని అంటారు. విద్యార్హతలు, పేద ధనిక భావన, స్త్రీ పురుష వివక్ష లేకుండా నిర్ణీత వయసు వచ్చిన వయోజనులందరికీ ఓటు హక్కు ప్రసాదించ బడుతుంది. దీన్ని సార్వత్రిక వయోజన ఓటు హక్కు అంటారు. ఓటర్ల అందరిని కలిపి ఎలక్ట్రో రేట్ అంటారు. ఎంపిక చేసేవారు ఓటర్లు. ఎంపిక కాబడిన వారు వారి ప్రతినిధులు. ప్రజలు ప్రత్యక్ష పద్ధతిలో తమ ప్రతినిధులను ఎన్నిక చేస్తే ఈ ఎన్నికను ప్రత్యక్ష ఎన్నిక లేదా డైరెక్ట్ ఎలక్షన్ అంటారు. ఎంపికైన ప్రజా ప్రతినిధులు ఒక ఎలక్టోరల్ కాలేజీ నియోజకవర్గంగా ఏర్పడి తాము మరో అధికార పదవికి ప్రతినిధిని ఎంపిక చేస్తే ఆ ఎన్నికను పరోక్ష ఎన్నిక లేదా ఇన్ డైరెక్ట్ ఎలక్షన్ అంటారు.




మనదేశంలో లో రాష్ట్ర శాసనసభల సభ్యులు, లోక్సభ సభ్యులు ప్రత్యక్షంగా ఎన్నికవుతారు రాజ్యసభ సభ్యులు పరోక్ష పద్ధతిలో ఎన్నికవుతారు. దేశంలోని అన్ని లేదా చాలా నియోజకవర్గాల్లో నిర్ణీత కాల పరిమితిని అనుసరించి ప్రజా ప్రతినిధులు ఎన్నికను నిర్వహించే ప్రక్రియను సాధారణ ఎన్నికలు అని అంటారు. రెండు సాధారణ ఎన్నికల మధ్యకాలంలో ఏర్పడిన ఒకటి లేదా కొన్ని ఖాళీలకు నిర్వహించే ఎన్నికలను మధ్యంతర ఎన్నికలు అంటారు. 

సార్వత్రిక ఓటుహక్కు 


భారత రాజ్య యొక్క ముఖ్య లక్షణాల్లో సార్వత్రిక వయోజన ఓటింగ్ హక్కు ఒకటి. దీనితో బ్రిటిష్ వారి కాలంలో ఓటింగ్ హక్కు కొంతమందికి మాత్రమే పరిమితం. మనదేశంలో మొదటిసారిగా క్రీస్తుశకం 1884 వ సంవత్సరంలో స్థానిక సంస్థలకు (లోకల్ బాడీస్) క్రీస్తు శకం 1892లో సంవత్సరంలో ప్రాంతీయ మండలాలకు నిర్వహించిన ఎన్నికల నాటి నుండి ఎన్నికలు అనే భావన పరిచయం చేయబడింది. బ్రిటిష్ వారి పరిపాలన కాలంలో క్రీస్తుశకం 1937 వ సంవత్సరంలో నిర్వహించిన చివరి ఎన్నికల్లో కేవలం 14 శాతం జనాభాకు మాత్రమే ఓటు హక్కు ఉండేది.ఈ ఓటు హక్కును పన్ను చెల్లింపుదారులు, విద్యావంతులు, సంపన్నులు మాత్రమే  అనుభవించారు. 

ఓటింగ్ ప్రక్రియ 


జిల్లా ఎన్నికల అధికారులు విస్తృతంగా చేస్తారు. పోలింగ్ కేంద్రాలను నెలకొల్పి ప్రతి దానిలో ఒక ప్రిసైడింగ్ అధికారి మరియు కొందరు పోలింగ్ అధికారులను నియమిస్తారు. పోలింగ్ జరిగే తేదీన ఓటర్ల జాబితాలో పేర్లు ఉన్న ఓటర్ల అందరిని ఓటు చేయడానికి అనుమతిస్తారు. ఓటర్ల నిజాయితీ లేదా నిజమైన ఓటర్లను గుర్తించడానికి లేదా వారి వాస్తవికతను సవాలు చేయడానికి అభ్యర్థుల తరపున నియమితులైన పోలింగ్ ఏజెంట్లు కు హక్కు ఉంది. ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులు లేదా వ్యక్తులు ఓటర్ల యొక్క వివరాలను విచారిస్తారు. ఆ తర్వాత ఓటర్ కు బ్యాలెట్ పత్రం ఇస్తారు. ఓటర్లు ఓటు వేసినట్లు గా గుర్తింపు కోసం ఎడమ చేతి చూపుడు వేలు పై చెరిగిపోని సిరా గుర్తు పెడతారు. ఓటరు తాము ఎంపిక చేయదలుచుకున్న అభ్యర్థి పేరు కు ఎదురుగా బ్యాలెట్ పత్రంలో స్వస్తిక్ ముద్ర వేసి నిర్ణీత విధానంలో మడిచి బ్యాలెట్ పెట్టెలు వేస్తారు. 

ఎన్నికల ఫలితాల ప్రకటన


పోలింగ్ పూర్తయిన తర్వాత బ్యాలెట్ పత్రాలు ఉన్న పెట్టెలకు సీలు వేసి ఓట్ల లెక్కింపు కేంద్రాలకు తెస్తారుు. అక్కడ ఓట్ల లెక్కింపు జరుగుతుందిి. అత్యధిక ఓట్లు సంపాదించిన అభ్యర్థి ఎన్నికైనట్లు గా ప్రకటిస్తారు.  




భారతదేశంలో ఎన్నికలు! ఫలితాలు! భారతదేశంలో ఎన్నికలు! ఫలితాలు! Reviewed by RK WRITERS on నవంబర్ 03, 2021 Rating: 5

కామెంట్‌లు లేవు:

Blogger ఆధారితం.