పోస్ట్‌లు

నవంబర్, 2022లోని పోస్ట్‌లను చూపుతోంది

బాలయ్యకు చిరుకు మధ్య పోటీ!

చిత్రం
చాలా రోజుల తర్వాత బాలయ్యకు చిరుకి మధ్య పోటీ కుదిరింది. అప్పుడెప్పుడో 2017లో మెగాస్టార్ చిరంజీవి నటించిన 'ఖైదీ నెంబర్ 150', నందమూరి బాలకృష్ణ నటించిన 'గౌతమీపుత్ర శాతకర్ణి' మధ్య పోరు జరిగింది. ఆ రెండు చిత్రాలు కూడా బాక్సాఫీస్ వద్ద బాగా కలెక్షన్లు రాబట్టాయి.  ఇన్ని రోజుల తర్వాత మెగాస్టార్ చిరంజీవి నటించబోతున్న 'వాల్తేరు వీరయ్య', నందమూరి బాలకృష్ణ నటించిన పోతున్న 'వీర సింహారెడ్డి' మధ్య పోరు జరగనుంది. ఇద్దరూ స్టార్ హీరోల మధ్య పోటీ జరుగుతుందంటే ఎలా ఉంటుందో చెప్పక్కర్లేదు, ఎందుకంటే ఒకప్పుడు ఇద్దరు కూడా పోటీ పడుతూ సినిమాలు తీశారు. ఇప్పుడు ఉన్న యంగ్ హీరోలతో పోటీపడి మరి, బాక్సాఫీస్ వద్దా భారీగా కలెక్షన్లో ఏమాత్రం తగ్గకుండా పోటీపడుతున్నారు.  అప్పట్లో వీరిద్దరి మధ్య సినిమా పోటీ జరుగుతుందంటే ఫ్యాన్స్ మామూలు హంగామా చేసేవారు కాదు. ఇంకా మెగాస్టార్ చిరంజీవి గురించి చెప్పాలంటే ఆయన డైలాగ్, డాన్స్, కామెడీ టైమింగ్, ఎక్స్ప్రెషన్స్, సినిమాకి హైలైట్ గా నిలుస్తాయి. ఇంకా నందమూరి బాలకృష్ణ గురించి చెప్పాలంటే ఆయన ఒక్కడే సినిమా మొత్తాన్ని నడిపించే సత్తా, ఆయన డైలాగ్ చెప్తుంటే సినిమా థ...