కంప్యూటర్ వైరస్ లు, ఇంటర్నెట్ టెర్మినాలజీ!
వైరస్ లు అతి సూక్ష్మ మైనవి. ఇవి ఇతర కణాలపై సోకి వాటిని అంతరింపజేస్తాయి.ఈ వైరస్ లు మనిషి శరీరంలో ప్రవేశించినప్పుడు ఎలా వ్యాధి గ్రస్తుడు అవుతాడో కంప్యూటర్లలోప్రవేశించినప్పుడు ప్రోగ్రామ్ లు సరిగా పనిచేయకపోవడం, ఇంకా అసలు పని చేయకపోవడం జరుగుతుంది. ఇవి కంప్యూటర్ లోని కీలకమైన సమాచారాన్ని పాడుచేయటం లేదా తొలగించడం చేస్తాయి. కంప్యూటర్ లోని సమాచారాన్ని పాడుచేయటమే వైరస్ లక్షణం. ఇంటర్నెట్ టెర్మినాలజి ఆండ్రాయిడ్ : ఆండ్రాయిడ్ 2008 సంవత్సరంలో మొదలయింది. శామ్ సంగ్, హెచ్. టి. సి మరియు మరికొన్ని ప్రసిద్ద కంపెనీల ఫోన్లలో ఈ ఆపరేటింగ్ సిస్టమ్ పనిచేస్తుంది.మనిషి తెలివితో సమానంగా అంతకుమించి కృత్రిమమైన మేధా శక్తిని కలిగిన కంప్యూటర్ సాఫ్ట్వేర్ ఆండ్రాయిడ్. ఫేస్ బుక్ : ఫేస్ బుక్ ను కనుగొన్నది మాస్ఓ స్కర్ బర్గ్. గ్లోబల్ సోషల్ నెట్వర్క్ ద్వారా పర్సనల్ ప్రొఫైల్ ను క్రెయేట్ చేసుకుని స్నేహితులను జతపరుచుకోవచ్చు.ఫేస్ బుక్ తెరవడానికి కనీస వయసు 13 సంవత్సరాలు నిండి ఉండాలి. యూ ట్యూబ్ : చాడ్ హార్లి, స్టీవ్ చెన్ జావేద్ కరీమ్ వీరు ముగ్గురు యూ ట్యూబ్ ను ప్...