పార్లమెంటులో ప్రవేశపెట్టే కొన్ని ముఖ్యమైన తీర్మానాలు!

 

విశ్వాస తీర్మానం: విశ్వాస తీర్మానాన్ని అధికార పక్షం లోకసభలో ప్రవేశపెడుతుంది.విశ్వాస తీర్మానం అనేది పార్లమెంటరీ రూల్స్ లో కానీ ప్రొసీజర్ లో కానీ ఎక్కడా కనిపించదు.భారతదేశ పార్లమెంటరీ చరిత్రలో మొదటి సారి విశ్వాస తీర్మానం 1979 ఫిబ్రవరిలో ప్రవేశపెట్టారు.దీని ద్వారా తొలిసారి చరణ్ సింగ్ ప్రభుత్వాన్ని సభ విశ్వాసాన్ని పొందమని రాష్ట్రపతి అదేశించటంతో భారతదేశ పార్లమెంటరీ సంప్రదయాలలో విశ్వాస తీర్మానం ఆచరణలోకి వచ్చింది.విశ్వాస తీర్మానం సభ యొక్క ఆమోదం పొందాలి.సభ ఆమోదం పొందని పక్షంలో ప్రభుత్వం రాజీనామా చేయాల్సి ఉంటుంది.

అవిశ్వాస తీర్మానం: అవిశ్వాస తీర్మానాన్ని లోకసభలో మాత్రమే ప్రవేశ పెడతారు. అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపక్షాలు సభలో ప్రవేశపెడతాయి. అవిశ్వాస తీర్మానాన్ని సభలో చర్చకు ఆమోదించినపుడు సభ్యులు ప్రభుత్వం యొక్క చర్యలపై వాద ప్రతి వాదనలు చేయటానికి అవకాశం ఉంటుంది. ప్రభుత్వం యొక్క ఏ విధానం పైన అయినా చర్చ జరపవచ్చు. అవిశ్వాస తీర్మానంను సభ స్వీకరించటానికి కనీసం 50 మంది సభ్యులు మద్దతు అవసరం. ఈటతీర్మానం స్పీకర్ అనుమతిస్తే సభ అన్ని కార్య కలపాలను పక్కకు పెట్టి అవిశ్వాస తీర్మానం పై చర్చను ప్రారంభిస్తుంది. సభ అవిశ్వాస తీర్మానాన్ని ఆమోదిస్తే ప్రభుత్వం రాజీనామా చేయాల్సి ఉంటుంది.





పార్లమెంటులో ప్రవేశపెట్టే కొన్ని ముఖ్యమైన తీర్మానాలు! పార్లమెంటులో ప్రవేశపెట్టే కొన్ని ముఖ్యమైన తీర్మానాలు! Reviewed by RK WRITERS on ఆగస్టు 12, 2020 Rating: 5

కామెంట్‌లు లేవు:

Blogger ఆధారితం.