రాష్ట్రంలో అత్యున్నతమైన కోర్టును హైకోర్టు అంటారు. నిబంధన 214 ప్రకారం ప్రతి రాష్ట్రంలో ఒక హైకోర్టు ఉంటుంది.నిబంధన 231 ప్రకారం రెండు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలకుపార్లమెంటు ఒక చట్టం ద్వారా ఉమ్మడి హైకోర్టును ఏర్పాటు చేస్తుంది.1861 కౌన్సిల్ చట్టం ప్రకారం దేశంలో మొట్ట మొదటిసారిగా హైకోర్టును 1862 లో కోల్కత్తా లో. ఏర్పాటు చేశారు. భారత రాజ్యాంగంలో 6వ భాగంలో 215 నుండి 231వరకు గల నిబంధనలలో రాష్ట్ర స్థాయిలో హైకోర్టులు, వాటి నిర్మాణం, అధికార విధుల గురించి పేర్కొన్నారు.2013లో మణిపూర్,మేఘాలయ, త్రిపురలలో మూడు హైకోర్టులను ఏర్పాటు చేయడంతో హైకోర్టు సంఖ్య 24కు చేరింది. నిబంధన 221 ప్రకారం హైకోర్టు న్యాయమూర్తుల జీతభత్యాలను పార్లమెంటు నిర్ణయిస్తుంది.
హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఇతర న్యాయమూర్తులను రాష్ట్రపతి నియమిస్తారు.సుప్రీంకోర్టులో లాగా హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య పరిమితి లేదు. హైకోర్టు న్యాయమూర్తిని సంప్రదిస్తాడు.నిబంధన 218 ప్రకారం హైకోర్టు జడ్జీలు తొలగించబడతారు. హైకోర్టు న్యాయమూర్తుల నియామకం, బదిలీకి సంభందించి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇచ్చిన సలహాను రాష్ట్రపతి పాటించాలి. హైకోర్టు మూడు రకాల అధికార పరిధులను కలిగి ఉంది.1.నిజమైన అధికార పరిధి 2.అప్పీలు అధికార పరిధి 3.రిట్ అధికార పరిధి..మద్రాస్,బొంబాయి, కోల్కత్తా హైకోర్టులు నిజమైన మరియు అప్పీలు అధికార పరిధిని కలిగి ఉన్నాయి.ప్రాథమిక హక్కులకు భంగం కలిగినవని భావించనపుడు హైకోర్టులు రిట్ లు జారీ చేస్తాయి.
42వ రాజ్యాంగ సవరణ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వచట్టాల రాజ్యాంగ నిబద్ధతను హైకోర్టులే నిర్ణయించాలి.
హైకోర్టు వివరణ!
Reviewed by RK WRITERS
on
ఆగస్టు 12, 2020
Rating:
కామెంట్‌లు లేవు: