- ఆధునిక కాలంలో బ్రిటిష్ వారు భారతదేశానికి వచ్చిన తరువాత జిల్లాను ఒక పరిపాలన యూనిట్ గా తీసుకుని 1772 కలెక్టర్ అనే పదవిని ప్రవేశపెట్టారు.
- 1726లో బంబాయ్, కోల్కత్తా నగరాలలో మేయర్ బోర్డులను ఏర్పాటు చేశారు.
- 1793లో మద్రాస్, బంబాయ్, కోల్కత్తా నగరాలలో వేర్వేరుగా మున్సిపల్ పరిపాలనను ప్రారంభించారు.
- 1870లో లార్డ్ మేయో ఆర్థిక వికేంద్రీకరణ తీర్మానం ప్రవేశపెట్టారు.
- 1882 లార్డ్ రిప్పన్ కాలంలో పనిచేసిన తీర్మానాలను స్థానిక స్వపరిపాలన సంస్థల పట్ల 'మాగ్నాకార్టా' గా అభివర్ణిస్తారు.లార్డ్ రిప్పన్ ను "స్థానిక సంస్థల పితామహుడు" గా పేర్కొంటారు.
- పంచాయతీరాజ్ సంస్థల గురించి కేంద్ర స్థాయిలో గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖ చూస్తుంది.
- రాజ్యాంగంలోని 7వ షెడ్యులలోని రాష్ట్ర జాబితాలో 5వ అంశం స్థానిక స్వపరిపాలన.
- స్థానిక ప్రభుత్వాలు అనే అంశాన్ని రాజ్యాంగంలోని 4వ భాగంలో 40వ నిభందనలో చేర్చారు.
- 1952లో కేంద్ర ప్రభుత్వం సమాజికాభివృద్ది కార్యక్రమం, 1953లో జాతీయ విస్తరణ సేవా పథకం ప్రారంభించింది.
- ఈ పథకాల అమలును పర్యవేక్షించి సూచనలు చేయటం కోసం కేంద్ర ప్రభుత్వం బాలవంతరాయ్ మేహతా అధ్యక్షతన ఒక కమిటీని ఏర్పాటు చేసింది.
- రాజ్యాంగం అమలులోకి వచ్చాక రాజ్యాంగంలో నిర్దేశిక నియమలలో నిబంధన 40లో గ్రామ పంచాయతీల ఏర్పాటు గురించి పేర్కొన్నారు.
- గ్రామీణ జనాభా పాల్గొనే సంస్థల ఏర్పాటు గురించి ప్రభుత్వం 1957లో బలవంతరాయ్ మెహతా కమీటీని ఏర్పాటు చేసింది.
- అమెరికాను వణికిస్తున్న ఉల్లిపాయ!
పంచాయతీరాజ్ వ్యవస్థ - మున్సిపాలిటీలు
Reviewed by RK WRITERS
on
ఆగస్టు 12, 2020
Rating:
కామెంట్‌లు లేవు: