అమరావతి రాజదానిని ఇక్కడ నుండి తరలించడం తాత్కాలికమైనది, అని జనసేన అధినేత 'పవన్ కళ్యాణ్' గారు అన్నారు. ఎందుకంటే ఇది 5 కోట్ల మంది ప్రజలు ఒప్పుకున్న తరువాత వచ్చిన రాజధాని ఇది. 33 వేల ఎకరాలు ఇచ్చి రైతులు ఈరోజు రోడ్ల మీద పడ్డారు, లాఠీ దెబ్బలు తిన్నారు, రక్తాలు చిందించారు. అడపడుచులని చూడకుండా మాన ప్రాణాలను ఇబ్బంది పెట్టే పరిస్థితికి తీసుకొచ్చారు. వాళ్ళకు అండగా నిలబడిన మహిళా నాయకురాలను కూడా పోలీసులు కొట్టారు. ఇది సంయుక్తంగా కూర్చొని దీని మీద ప్రత్యేకంగా చర్చిస్తామన్నారు.
కచ్చితంగా ఇక్కడ నుండి అమరావతి రాజధాని ఒకవేళ వాళ్ళు కదిలించిన అనుకున్న గాని అది తాత్కాలికమే. అని కచ్చితంగా తెలియజేస్తున్నాము అని పవన్ కళ్యాణ్ గారు వ్యాఖ్యానించారు. అలాగే మా ఎమ్మెల్యే జనసేన పార్టీ మీద ఎన్నికైన రాపక వరప్రసాద్ గారు కూడ జనసేన పార్టీ స్టాండ్ తీసుకోకుండా వైసీపీ పార్టీ స్టాండ్ తీసుకున్నారు. అది నిజంగా చాలా బాధను కలిగించింది అని పవన్ కళ్యాణ్ గారు తెలిపారు. దీని మీద బాగా ఆలోచించి పార్టీ నాయకులతో మాట్లాడి బలమైన నిర్ణయం తిసోకుంటామని మీడియా ముందు ఆయన వ్యక్తం చేశారు.
అలాగే అన్నీ వెనకబడినప్రాంతాలు అభివృద్ధి కావాలని కోరుకున్నాం తప్పా రాజదాని పెడితే అభివృద్ధి వస్తుంది అనుకున్న ధోరణి జనసేనకు లేదు. అలాంటప్పుడు 13 జిల్లాలకు 13 రాజధానులు పెట్టండి, ఇన్ని వేల గ్రామాలకు ఒక్కో రాజధానిని పెట్టండి, అని ఆయన వ్యాకనించారు.రాజదాని అంటే రియల్ ఎస్టేట్ ఆట అయిపోయిందని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. నేనున్నా కూర్చోబెట్టి ఇంత పెద్ద రాజధాని అవసరం లేదని, గాంధీనగర్ తరహా కనీసం 14 వేల ఎకరాలు సరిపోతుందని ఆరోజు నేను మాట్లాడను, జనసేన మాట్లాడింది.
రైతులకు, మహిళలకు అండగా నిలుద్దామంటే మమ్మల్ని కూడా ఈరోజు నిర్బంధించారు. జాతీయ స్థాయిలో ఇది చాలా బలమైన మార్పులకు దారితీయబోతుంది, అని పవన్ కళ్యాణ్ గారు తెలియజేసారు.
మీరు ఈ క్రిందా వీడియో ను చూస్తే పవన్ కళ్యాణ్ గారు ఎం చెప్పారో తెలుస్తుంది,
మూడు రాజధానులపై పవన్ కల్యాణ్ వాఖ్యలు!
Reviewed by RK WRITERS
on
ఆగస్టు 12, 2020
Rating:
కామెంట్‌లు లేవు: