సిమెంటును ఎలా తయారు చేస్తారు!

 సిమెంటు అనునది ఇది కాల్షియం సిలికేట్, కాల్షియం అల్యూమినేట్ ల మిశ్రమం. సిమెంట్ ముడి పదార్థాలు సున్నపురాయి,బంకమన్ను. సిమెంట్ తయారీ ఉష్ణోగ్రత 1700-1900డిగ్రీ సెంటిగ్రేడ్.సిమెంట్ పరిశ్రమలో చివరికి ఏర్పడే కాల్షియం సిలికేట్, అల్యూమినియం సిలికేట్ యొక్క గట్టి ముద్దలను క్లింకర్ లు అంటారు. క్లింకర్ లను చూర్ణంచేసి 2-3 శాతం జిప్సమును కలిపిన పొడిని సిమెంటు అంటారు. సిమెంటు గట్టిపడే తనాన్ని జిప్సం నిర్ణయిస్తుంది. సిమెంటు, ఇనుప ఊచనలను కలిపి రెయిన్ ఫోర్స్ డ్ కాంక్రీట్ అంటారు.

ఫోర్ట్ ల్యాండ్ సిమెంట్: భవనాలు, వంతెనలు, నది ఆనకట్టలు మొదలైన వాటి నిర్మాణం లో ఉపయోగించే అతి అతి ముఖ్యమైన పదార్థం సిమెంట్. ఈ కాలంలో సిమెంట్  రహిత నిర్మాణాలను ఊహించలేము.
   సిమెంటును 1824వ సంవత్సరంలో జోసెఫ్ ఎస్పిడిన్ అనే ఒక తాపీ మేస్త్రి కనుగొన్నాడు. సున్నపురాయి, బంకమట్టిల మిశ్రమాన్ని అధిక ఉష్ణోగ్రతకు వేడి చేస్తే ఇది ఒక పొడిని ఏర్పరుస్తుంది అని కనుగొన్నాడు. ఈ పొడికి తగినంత నీటిని కలిపితే కొన్ని గంటలలో అది రాయి వలె మారుతుంది. ఈ గట్టిపడిన పదార్థం పోర్ట్ ల్యాండ్ అనే ప్రదేశంలో లో దొరికే రాయి వంటి బలమైనది కాబట్టి దీన్ని పోర్ట్ల్యాండ్ సిమెంట్ అంటారు. 

సిమెంటు తయారీకి కావలసిన ముడి పదార్థాలు:

1. సున్నపురాయి (ఇది క్యాల్షియంను అందజేస్తుంది)
2. బంకమనుఅన్నా (ఇది ఇది అల్యూమినా చీలికలను అందజేస్తుంది)

a. తడి పద్ధతి     b. పొడి పద్ధతి
 
తడి పద్ధతి: తడి పద్ధతిలో ముందుగా బంకమన్నును కడుగు యంత్రంలో వేసి కడిగి శుభ్రపరుస్తారు. సున్నపు రాయిని సన్నాని పొడిగా నలగగొట్టి, శుద్ధి చేయబడిన తడి బంకమన్ను తో తగిన నిష్పత్తిలో కలుపుతారు. దీన్ని 'ముడి స్లర్రీ' అంటారు.ఇందు 40 శాతం నీరు ఉంటుంది. స్లర్రీని మిశ్రమ యంత్రంలో వేసి ఏకరీతి మిశ్రమం లభించే వరకు కలియ పెడతారు.
 
   పొడి పద్ధతి: పొడి పద్ధతిలో ముడి పదార్థాలను తగిన నిష్పత్తిలో కలిపి, మిశ్రమాన్ని ఎండబెట్టి చూర్ణము చేసి బాగా కలియబెట్టి ఏకరీతి మిశ్రమం తయారుచేస్తారు. ఈ మిశ్రమాన్ని ముడి చూర్ణము అంటారు. పై పద్ధతులలో ఏదైనా ఒక పద్ధతిలో లభించే ముడిచూర్ణంను లేక ముడి స్లర్రీలను'ప్రగలన పదార్థము' అని అంటారు. ప్రగలన పదార్థంను తిరుగుడు కొలిమిలో వేసి సిమెంటును తయారు చేస్తారు. సిమెంటును అధిక ఉష్ణోగ్రత వద్ద కొలిమిలో వేడి చేయడం వలన నీటిని, కార్బన్ డయాక్సైడ్ ను కోల్పోతుంది.


    ఫలితంగా కాల్షియం సిలికేట్లు అల్యూమినియం సిలికేట్లు ఏర్పడతాయి. ఏర్పడే పదార్థం  బూడిద రంగులో గట్టి బంతుల రూపంలో లో ఉంటుంది. దీన్ని 'క్లింకర్ సిమెంటు' అంటారు. క్లింకర్ ను చల్లబరచి, సన్నని పొడిగా గా నలగగొట్టి2-3 శాతం వరకు జిప్సంను కలిపి గాలి ప్రవేశించని సందులలో నింపి రవాణా చేస్తారు. 


సిమెంటును ఎలా తయారు చేస్తారు!  సిమెంటును ఎలా తయారు చేస్తారు! Reviewed by RK WRITERS on ఆగస్టు 02, 2020 Rating: 5

కామెంట్‌లు లేవు:

Blogger ఆధారితం.