జబర్దస్త్ షోకి నాగబాబుగారు రీఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు!
నాగబాబు గారు ఒక నటుడుగా, కమెడియన్ గా, నిర్మాతగా, విలన్ గా, అన్ని పాత్రలు పోషించి సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొని, అలాగే పొలిటిషియన్ గా ఇప్పుడు జనసేన అధినేత తన తమ్ముడు అయినటువంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ముందుకు సాగుతున్నారు.
జబర్దస్త్ షో కి ఒకప్పుడు జడ్జ్ గా వచ్చి ఒక వెలుగు వెలిగి, తన పంచ్ డైలాగులతో, కామెడీతో, తన నవ్వుతో, అందరిని ఆకట్టుకున్నారు. జబర్దస్త్ సోలో కొత్త కమెడియన్స్ కి అవకాశం ఇస్తూ, కొత్త వాళ్లను ఎంకరేజ్ చేస్తూ, ఎంతోమంది కమెడియన్స్ను సినీ ఇండస్ట్రీకి పరిచయం చేశారు.
జబర్దస్త్ షోలో కొన్ని సంవత్సరాలు జడ్జిగా వ్యవహరించి తనకంటూ ప్రత్యేక గుర్తింపును సాధించుకుని ఎంతోమంది నటులను పరిచయం చేశారు. ఒకప్పుడు నేను కష్టాల్లో ఉన్నప్పుడు మల్లెమాల ప్రొడక్షన్స్ నాకు అవకాశం ఇచ్చింది, అని చాలాసార్లు చాలా ఇంటర్వ్యూలలో చెప్పడం గమనార్హం . జబర్దస్త్ షో నుంచి కొన్ని విభేదాల కారణంగా బయటికి వచ్చారు, తనతోపాటు ఆయన మీద నమ్మకం వున్న చాలామంది కమెడియన్స్ కూడా బయటకు వచ్చేశారు .
ఆయన బయటకు వచ్చిన తర్వాత జి చానల్లో 'అదిరింది' అనే ప్రోగ్రాం కు జడ్జిగా వ్యవహరించారు. 'అదిరింది' సో కూడా చాలా రోజులు బాగానే ఆడింది, కానీ ఏమైందో ఏమో కానీ తెలియదు, నిలిచిపోయింది. మళ్లీ కొన్ని రోజుల తర్వాత స్టార్ మా లో 'కామెడీ స్టార్' కి జడ్జిగా వ్యవహరించారు అది కూడా ఏడాది దాటకముందే నిలిచిపోయింది.
గత ఏడాది మా ఎన్నికల్లో మంచు విష్ణు మరియు ప్రకాష్ రాజు పోటీ పడిన విషయం తెలిసిందే. అప్పుడు మెగా ఫ్యామిలీ ప్రకాష్ రాజ్ కు సపోర్టు ఇవ్వడం కూడా తెలిసింది. మంచు విష్ణుకు నరేష్ గారు సపోర్ట్ గా నిలిచారు. అయితే మీరు ఇరువురు మధ్య మాటల యుద్ధం జరిగింది.
ప్రస్తుతం నాగబాబుగారు జనసేన పార్టీ తరఫున ప్రచారం చేస్తూ యాక్టివ్గా కనిపిస్తున్నారు. జబర్దస్త్ కి నాకు విభేదాలు గానీ ఎలాంటి గొడవలు గానీ లేవు. ఒకవేళ జబర్దస్త్ నన్ను ఆహ్వానిస్తే మాత్రం తప్పకుండా రీ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను, అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.
కామెంట్‌లు లేవు: