ధాన్యాలు: మొక్కలు స్వయంపోషకాలు. తమ ఆహారాన్ని తామే తయారు చేసుకోగలవు. మొక్కకు వాటికి అవసరమైన దాని కంటే ఎక్కువ ఆహారం తయారు చేసుకోగల శక్తి ఉంది. ఎక్కువైన ఆహారాన్ని మొక్క వివిధ భాగాలలో నిల్వ చేసుకుంటుంది. మన తినే ఆహారంలో వరి, గోధుమ, మొక్కజొన్న మొదలైనవి ముఖ్యమైన ధాన్యాలు.
చిరు ధాన్యాలు: చిరు ధాన్యాలు చిన్న గింజలతో కూడిన ఏకావార్షిక గడ్డి జాతికి చెందిన మొక్కలు.ఉదాహరణకు జొన్నలు, సజ్జలు, రాగులు.పప్పు ధాన్యాలు లేక అపరాలు కూడా మనం తినే ముఖ్య ఆహార పదార్థాలే.
నూనె గింజలు: మనం తీసుకునే ఆహారంలో ఒక భాగం నూనెలు. మనం వంటలలో ఉపయోగించుకునే నూనె గింజలు మనకు అనేక రకమైన మొక్కల నుండి లభిస్తాయి. ఉదాహరణకు వేరుశనగ, అవ, పామ్, నువ్వులు, సన్ఫ్లవర్, కొబ్బరి ఇలా అనేకమైన నూనెలు ఉన్నాయి.
సన్ ఫ్లవర్ నూనె వాడకం ఎక్కువ వ్యాప్తిలో ఉంది. ఇది ఎక్కువ శాతం పాలీ అన్ సా ట్యూ రేటెడ్ ఫాటీ ఆమ్లాలు కలిగి ఉండుట వలన హృద్రోగాలు కలిగించే అవకాశాలు తగ్గిస్తుందని నమ్మకం.ఇవే కాకుండా ఇతర మొక్కల నుండి కూడా ఉత్పత్తి అవుతాయి. ఈ నూనెలకు ప్రత్యేక సువాసన ఉంటుంది.కాబట్టి వీటిని 'సువాసన నూనెలు' అంటారు. ఉదాహరణకు నిమ్మ, లవెండరు, కర్పూర తైలం.వేప గింజల నుండి తీసిన నూనెను సూక్ష్మజీవి నాశకంగా ఉపయోగిస్తారు.
ఆహారం ఉత్పత్తి చేసే మొక్కలు!
Reviewed by RK WRITERS
on
ఆగస్టు 12, 2020
Rating:
కామెంట్‌లు లేవు: